నందలూరులో కోటి రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం – రూ.40 లక్షల సిమెంటు రోడ్డు ప్రారంభం

రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు కృషితో నందలూరు మండలంలో దాదాపు రూ. కోటి నిధులు మంజూరై పలు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. పాటూరు గ్రామపంచాయతీ పరిధిలోని వైకే పల్లి నుండి నాగిరెడ్డిపల్లె వరకు రూ.40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు పనులను మాజీ జడ్పిటిసి సభ్యుడు యల్లటూరు శివరామరాజు ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న రైతులు, గ్రామస్థుల సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. హామీలకే పరిమితం కాకుండా నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడంపై ప్రజలు శ్రీనివాస రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఇంజనీర్లు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe