ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు – తూర్పు రొంపి దొడ్లలో మారినేని రామకృష్ణ సేవా కార్యక్రమం

వరికుంటపాడు మండలంలోని తూర్పు రొంపి దొడ్ల గ్రామంలో పలు నిరుపేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేయడం జరిగింది. గ్రామంలోని కొన్ని కుటుంబాలు గ్యాస్ సౌకర్యం లేక కట్టెల పొయ్యులతో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న యువ నేత మారినేని రామకృష్ణ, బాధిత కుటుంబాలను నేరుగా కలిసి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం వివరాలు తెలియజేశారు. అర్హులైన లబ్ధిదారుల నుంచి అవసరమైన ధ్రువపత్రాలు సేకరించి, స్థానిక గ్యాస్ ఏజెన్సీ ప్రోప్రైటర్ ఓబయ్య దృష్టికి తీసుకెళ్లి, నమోదు ప్రక్రియను వేగవంతం చేసి కనెక్షన్లు మంజూరు చేయించారు.

అనంతరం మారినేని రామకృష్ణ చేతుల మీదుగా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇంకా గ్యాస్ సౌకర్యం అందకపోవడం గమనించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో గ్రామాభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. గతంలో పథకాలు కొంతమందికే పరిమితమయ్యాయని, ప్రస్తుతం అవినీతి లేకుండా అర్హులందరికీ అందుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తమ వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో లబ్ధిదారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe