జగన్‌కు జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వాలి: మంత్రి కొల్లు రవీంద్ర

వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడిచిందని, అటువంటి పరిస్థితులకు కారణమైన జగన్‌కు ‘జంగిల్ రాజ్ అవార్డు’ ఇవ్వాలని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. పార్టీ కార్యాలయాలు, దేవాలయాలపై దాడులు జరగడం అప్పటి అరాచక పాలనకు నిదర్శనమని అన్నారు.

విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, బూతులు తిట్టి ప్రజలను రెచ్చగొట్టి తన్నులు తిన్న వారిని పరామర్శించడం ద్వారా విద్వేష రాజకీయాలకు జగన్ తానే నాయకత్వం వహిస్తున్నట్టు స్పష్టమవుతోందన్నారు. తెనాలిలో బ్లేడ్ బ్యాచ్‌ను పరామర్శించడం ద్వారా అలాంటి శక్తులను ప్రోత్సహిస్తున్నానని జగన్ సంకేతమిచ్చారని వ్యాఖ్యానించారు. ఇలాంటి రాజకీయాల వల్లే వైకాపా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే పార్టీ భవిష్యత్తు మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరించారు.

WhatsApp Join Now
Youtube Subscribe