నందిగామ ఎల్లో సింగం రిపోర్టార్
ఆంధ్రరాష్ట్ర ఎన్ పి సి బి. & వి ఐ ప్రోగ్రామ్ ఎన్టీఆర్ జిల్లా అంధత్వ నివారణ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు నందిగామ జిల్లాపరిషత్ స్కూల్ లో మరియు అనాసాగరం జిల్లాపరిషత్ స్కూల్ లో నందిగామ శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ విద్యార్థులు విటమిన్ ఏ లోపం వల్ల కంటి సమస్యలు వస్తాయని కావున ఈ వ్యాదులు తగ్గించుకొనుటకు ఏ విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయని చరవాణి కి టీవీ లకు దూరంగా ఉండాలని కోరారు రెండు స్కూల్స్ లో 110 కళ్ళ జోళ్ళు పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమం లో హాస్పిటల్ సూపరిండెంట్ సత్యనారాయణ డాక్టర్ స్వప్నలత .హెచ్ డి ఎస్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు.హెచ్ ఎమ్. విజయలక్ష్మి స్కూల్ చైర్మన్ మల్లెపోగు శ్రీను పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడుఏచూరి రాము పి ఎమ్ ఓ ఏ శేషు కుమారి తదితరులు పాల్గొన్నారు
