మత్స్యకారుల విడుదలుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు జరిపిన
రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ఘన స్వాగం పలికిన అధికారులు ..నిత్యావస సరుకులు అందజేసిన అధికారులు.
రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
విశాఖపట్నం, ఫిబ్రవరి 2: బంగ్లాదేశ్ నౌకాదళం చెరలో చిక్కుకున్న తొమ్మిది మంది విజయనగరం జిల్లా మత్స్యకారుల విడుదల వ్యవహారం సుఖాంతమైంది. రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన శాఖా పరంగా తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, దౌత్యపరమైన ఒత్తిడి కారణంగా మత్స్యకారులు సోమవారం క్షేమంగా విశాఖ తీరానికి చేరుకున్నారు. అధికారులు వారికి స్వాగతం పలికారు. మూడు నెలలుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడటంతో వారి సంబరాలు మిన్నంటాయి. వారిని నివాసాలకు చేరుకున్నారు.
గత అక్టోబర్‌లో మత్స్యకారులు అన్యదేశంలో బందీలుగా చిక్కుకుపోయారన్న వార్త తెలియగానే మంత్రి అచ్చెన్నాయుడు అత్యంత వేగంగా స్పందించారు. కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా, ప్రతి దశలోనూ వ్యక్తిగత పర్యవేక్షణ చేశారు. మత్స్యశాఖ మంత్రిగా అధికారులను వెంటనే అప్రమత్తం చేసి, పడవ రిజిస్ట్రేషన్ వివరాలు, మత్స్యకారుల చిరునామాలను సేకరించి కేంద్ర విదేశాంగ శాఖకు నివేదించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,కేంద్ర మంత్రి కింజరాపు రామ్మెహన్‌నాయుడు వద్దకు స్వయంగా సమస్యను వివరించారు మత్స్యకారుల దీనస్థితిని వివరించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాయించడంలో కీలక పాత్ర పోషించారు. మూడు నెలల కాలంలో విడుదల కావడంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కృషి అభినందనీయమని మత్స్యకారులు మత సంతోషాన్ని పంచుకున్నారు.
భారత కోస్ట్‌గార్డ్, బంగ్లాదేశ్ అధికారులతో మత్స్యశాఖ ఉన్నతాధికారులు నిరంతరం టచ్‌లో ఉండేలా చూస్తూ, విడుదల ప్రక్రియలో ఎదురైన సాంకేతిక అడ్డంకులను తొలగించారు. బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి విడుదలైన మత్స్యకారులు సోమవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. తమను సురక్షితంగా రప్పించడంలో అహర్నిశలు కృషి చేసిన మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మత్స్యకారుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మా అచ్చెన్నాయుడు గారే మాకు పెద్ద దిక్కుగా నిలబడ్డారు.. ఆయన చొరవ వల్లే ఈ రోజు మా వారు కళ్లముందు ఉన్నారని మత్స్యకార మహిళలు భావోద్వేగానికి లోనయ్యారు.
మత్స్యకారుల శ్రేయస్సే లక్ష్యం
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మత్స్యశాఖ మంత్రిగా మా మత్స్యకారుల క్షేమమే మాకు ప్రథమ ప్రాధాన్యం. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు ఉన్నా, కేంద్ర ప్రభుత్వ సాయంతో వారిని రప్పించగలిగాం. ఆపదలో ఉన్న మత్స్యకారులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
