దత్తగిరి నారాయణ తపోవన ఆశ్రమంలో అన్నదాన సరుకుల విరాళం
ఆశ్రమ వాసులకు బియ్యం, కూరగాయలు, నిత్యావసరాల పంపిణీ
చిన్నారి సేవాభావాన్ని ప్రశంసించిన పీఠాధిపతి నాగేశ్వరమ్మ
చిట్వేల్ ఫిబ్రవరి 02 శివ ప్రతినిత్యం ప్రతినిధి
శ్రీ శ్రీ శ్రీ దత్తగిరి నారాయణ తపోవన ఆశ్రమంలో సేవాభావానికి ప్రతీకగా నిలిచే కార్యక్రమం జరిగింది. చిట్వేల్ మండలం కేకే వడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓర్సు లక్ష్మి నారాయణ, జయమ్మ గారి మనుమరాలు, ఓర్సు ప్రేమ్ నాథ్ మరియు లక్ష్మీదేవి గార్ల కుమార్తె అయిన ఓర్సు తేజశ్రీ పదవ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమానికి బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు విరాళంగా అందజేశారు. పుట్టినరోజును ఆనందోత్సవంగా కాకుండా, సేవా దృక్పథంతో నిర్వహించడం అభినందనీయమని ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ తెలిపారు. చిన్న వయస్సులోనే దానధర్మాల పట్ల ఆసక్తి కలగడం భవిష్యత్తుకు శుభ సూచకమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తేజశ్రీ కుటుంబ సభ్యులు ఆశ్రమ వాసులకు అవసరమైన ఆహార సరుకులను అందించి, మానవతా విలువలను చాటుకున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ఆశ్రమ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
