ఎల్లో సింగం ప్రతినిధి:గిరిజనులు సాగుచేస్తున్న అటవీ భూములకు పోడు పట్టాలు మంజూరు చేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాగండి సాయిబాబు,పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు…ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు… అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూకురుపాం మండలం,బియ్యాల వలస పంచాయతీ,గొంది లోవ గ్రామానికి చెందిన 40 గిరిజన కుటుంబాలు గత 30 ఏళ్లు గా సాగు చేస్తున్న అటవీ భూములకు నేటికీ పోడు పట్టాలు మంజూరు చేయలేదని వివరించారు….దీంతో రైతు భరోసా రావడం లేదని వివరించారు….తక్షణమే గిరిజనులకు పోడు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు…గ్రామానికి చెందిన బీ.బలరాం,బీ.వెంకట రావు, తదితరులు పాల్గొన్నారు…అలాగే గిరిజన గ్రామాలకు రోడ్డు కూడా వేయాలని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు…. పార్వతీపురం మండలం గోచెక్క పంచాయతీ,కొత్త లిడికి వలస నుండి లిడికి వలస మీదుగాటొంకి వరకు ఐదు కిలో మీటర్లు,కొత్త లిడికి వలస నుండి తాడంగి వలస వరకు మూడు కిలోమీటర్లు, ఆడారు పంచాయతీ జిల్లెడు వలస నుంచి ఒడిసా సరిహద్దు వరకు 150 మీటర్లు రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.
పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలి.
02
Feb
WhatsApp
Join Now
Youtube
Subscribe
