శ్రీశైలం, ఫిబ్రవరి, 2
( ఎల్లో సింగం ప్రతినిధి )
శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.నేటి ఉదయం శ్రీశైలం విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఆలయ ఈవో ఏం. శ్రీనివాసరావు, ఛైర్మెన్ పోతుగుంట రమేష్ నాయుడు స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల నుంచి వేదాశీర్వచనం అందుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మంత్రి.రాష్ట్ర ప్రజలందరికీ శ్రీశైలం మల్లన్న ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు మంత్రి.బ్రహ్మోత్సవాల కోసం జరుగుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు మంత్రి. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు
