పార్వతీపురం ఎల్లో సింగం ప్రతినిధి:ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును సోమవారం టిడిపి పార్టీ కార్యాలయంలో పంపిణీ చేసిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర .లబ్ధిదారులు వివరాలు
- పార్వతీపురం 22 వార్డ్ కి చెందిన కుంటరాజుకు 75,374 రూ,,చెక్కును ఎమ్మెల్యే విజయ్ చంద్ర అందజేశారు.
- పార్వతీపురం పట్టణ ఆరో వార్డుకి చెందిన గుడ్ల రాహుల్ కుటుంబ సభ్యులకి 23,889రూ,, చెక్కులను ఎమ్మెల్యే విజయ్ చంద్ర అందజేశారు.
ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ పేదలకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉన్న వాళ్లకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులకు ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందజేస్తున్నారని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స చేయించుకోవటం కోసం ఎమ్మెల్యే విజయ్ చంద్ర గారిని సహాయం కోసం అడిగితే అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందజేశారని, వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి,ఎమ్మెల్యే విజయచంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
