సీఎం చంద్రబాబు నాయుడు అసభ్య వ్యాఖ్యలు – సిగ్గుచేటు

సభ్యసమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు

ఎల్లో సింగం న్యూస్ హోళగుంద ఫిబ్రవరి 1

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత, అసభ్య వ్యాఖ్యలను టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్.టిడిపి రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి కే.ఎండీ. ఆదాం టీడీపీ మండల మైనారిటీ అధ్యక్షుడు ముల్లా మోయిన్ మంగళి వెంకటేష్ ల్యాబ్ గిరి రామాంజీ తీవ్రంగా ఆదివారం ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
అంబటి రాంబాబు తన నోరు అదుపులో పెట్టుకోవాలని, లేనిపక్షంలో రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంబటి చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం మొత్తం తలదించుకునేలా ఉన్నాయని, ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు.
నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి, నాలుగు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంటే, ఆ విజయాన్ని ఓర్వలేక వైసీపీ నాయకులు బూతుల పురాణంతో చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చీప్ రాజకీయాలను ప్రజలు ఎప్పటికీ క్షమించరని స్పష్టం చేశారు.
రాజకీయంగా విమర్శలు చేయాలంటే పాలన, విధానాలపై చేయాలని, కానీ వ్యక్తిగత దూషణలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని అన్నారు. ముఖ్యంగా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నేతపై ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తుందని హెచ్చరించారు.
ఇలాంటి బూతు రాజకీయ సంస్కృతిని ప్రోత్సహించే నేతలను రాజకీయంగా బహిష్కరించాలని, అవసరమైతే ఇలాంటి పార్టీలపై ఎన్నికల సంఘం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని స్పష్టంగా కోరారు.
ఈ కార్యక్రమoలో
సర్పంచ్ హేసన్ దీదీ నాగప్ప వెంకటేష్ ల్యాబ్ గిరి గిరి రారవి సిద్ధూ ఇబదుల్లా ఆలం లతీఫ్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe