నందిగామ నియోజకవర్గంలోనే అరుదైన అవకాశం – స్వామివారి విగ్రహానికి నేరుగా తైలాభిషేకం చేసుకునే సౌభాగ్యం : ప్రభుత్వ విప్
నందిగామ ఎల్లో సింగం రిపోర్టార్
పట్టణం శ్రీ రామలింగేశ్వర నగర్‌లో శనీశ్వర స్వామి తృతీయ వార్షికోత్సవం మరియు స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమాలు భక్తుల గోవింద నామస్మరణల మధ్య భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య భక్తజన బృందంతో కలిసి పాల్గొని స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు.
అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నవితరణ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, భారతదేశంలో మహారాష్ట్రలోని శని సింగనాపూర్ గ్రామంలో భక్తులకు నేరుగా శనీశ్వర స్వామి విగ్రహానికి తైలాభిషేకం చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా నందిగామ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన శనీశ్వర స్వామి విగ్రహానికి కూడా భక్తులు నేరుగా తైలాభిషేకం చేసుకునే అపూర్వ అవకాశం కల్పించబడటం ఎంతో విశేషమని పేర్కొన్నారు. శనీశ్వర స్వామి విగ్రహావిష్కరణ జరిగి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ఆలయంలో భక్తులు తమ తమ బాధలను, కష్టాలను స్వామివారికి విన్నవించుకుంటూ నేరుగా తైలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకుంటున్నారని తెలిపారు. ఇటువంటి అరుదైన ఆధ్యాత్మిక అవకాశాన్ని నియోజకవర్గంలో కల్పించడం నిజంగా హర్షణీయమని, భక్తుల విశ్వాసంతో ఈ ఆలయం మరింత ఖ్యాతిని పొందుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వేద పండితులు, ప్రధాన అర్చకులు, మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి, ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, అధికారులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
