అంబటిని ఏ జంతువుతో పోల్చాలి?

ఎవడివిరా నువ్వు.. నీ భాష ఏమిటి.l..

పార్టీల మధ్య చిచ్చు పెడతావా?

ఇటువంటి పశువును అరెస్టు చేస్తే.. కాపులను అరెస్టు చేశారా?

అందరినీ కాపు కాసేవాడు కాపు..

కులాల మధ్య చిచ్చు పెట్టడం సిగ్గు చేటు

వైకాపా నేతల్లో కానరాని పశ్చాతాప్తం

మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యలు అత్యంత నీచం

ఒక ముఖ్యమంత్రిపై ఇలానే మాట్లాడతారా?

వారి అధినేత నేర్పిన సంస్కారం ఇదే..

బొత్సలాంటి సీనియర్ నాయకులు సమర్థించడం ఏమిటి..

ఇదేనా మీ అనుభవం, విలువలు రాజకీయాలు!

డీసీసీబీ చైర్మన్, తెదేపా జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున

అంబటి రాంబాబుపై ఒకటో పట్టణ స్టేషనులో ఫిర్యాదు

విజయనగరం(1.02.26):
గోదావరి ప్రతినిధి

“అంబటి రాంబాబు గాడిని.. ఏ తిట్టు తిట్టాలన్నా ఆలోచిస్తున్నాం. ఏ జంతువుతో పోల్చాలన్నా ఆలోచిస్తున్నాం. వాడిని ఒక తిట్టు తిట్టినా, ఒక జంతువుతో పోల్చినా ఆ జంతువుకు కూడా అవమానం జరుగుతుందని ఆగుతున్నాం. ఎవడివిరా నువ్వు.. నువ్వు మాట్లాడే భాష ఏమిటి? రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం నువ్వు ఇలానే మాట్లాడతావా?” అని డీసీసీబీ చైర్మన్, తెదేపా జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏ రోజు అయినా ఇలా మాట్లాడామా.. గత ఆరు ఏళ్ల కాలంలో తాను ఒక మండల స్థాయి నాయకుడి కోసం గానీ, గ్రామ స్థాయి నాయకుడి కోసం గానీ ఏ రోజు అయినా తాను ఇలా మాట్లాడానా? అని ప్రశ్నించారు. “పార్టీల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెడతావా? నీ కుటుంబాన్ని ఎవరైనా ఇలా అంటే నీకు ఎలా ఉంటుంది?.. మేము గుంటూరు వెళ్లలేకపోయాం. మేము ఈ రోజు పోలీసులకు ఒకటే అడుగుతున్నాం. అంబటిని ఒక్క అయిదు నిమిషాలు మాకు వదిలి చూడండి” అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని తెలిపారు. ఒక మంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం దురదృష్టకరమని.. ఇలాంటి రాజకీయ నాయకులు మన మధ్య తిరుగుతుండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని తెలిపారు. అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నాగార్జున.. పార్టీ నాయకులతో కలిసి ఆదివారం విజయనగరంలోని ఒకటో పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. సభ్య సమాజాన్ని అవమానించేలా.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన అంబటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

కాపు కులంపై ఆపాదించడం ఏమిటి?

అంబటి వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి.. కాపు కులంపై జరిగిన దాడి అంటూ కులాల మధ్య చిచ్చు రేపడం ఏమిటని నాగార్జున ప్రశ్నించారు. ఇటువంటి పశువులను అరెస్టు చేస్తే కాపులను అరెస్టు చేశారా? అని నిలదీశారు. “అందరికీ కాపు కాసేవాడు కాపులు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాటం చేసేవాడు కాపు. నేను కూడా కాపునే. భాజపాలోనూ, వైకాపాలోనూ కాపులు ఉన్నారు. ఇలాంటి పశువులను అరెస్టు చేస్తే కాపులతో పోల్చడమా? ఈ రకమైన భాష మాట్లాడితే ఎవరినీ ఉపేక్షించేది లేదు. చట్టం తన పని తాను చేసుకుంటుంది. అంబటి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా? ఖండిస్తారా? నేరుగా ఏమీ మాట్లాడకుండా కులాల మధ్య చిచ్చు పెట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని” నాగార్జున అన్నారు.

డైవర్షన్ రాజకీయాలే..

గత ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైనా.. వైకాపా నేతల్లో పశ్చాతాప్తం కానరావడం లేదని విమర్శించారు. వారి అధినేత జగన్ నోటి వెంట ఎప్పుడూ “వాడు.. వీడు..” అంటూ సంస్కారం లేని మాటలే వస్తాయని గుర్తు చేశారు. ఆయన వైఖరే.. ఆ పార్టీ నేతల్లోనూ ఉందని విమర్శించారు. మంత్రిగా పనిచేసిన వ్యక్తికి.. ఒక ముఖ్యమంత్రిని ఎలా సంబోధించాలో తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి నిబద్ధత కలిగిన, విజన్ ఉన్న నాయకుడిపై ఇష్టానుసారంగా మాట్లాడటం సహించబోమని హెచ్చరించారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలు.. రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఇది డైవర్షన్ రాజకీయాలేనని విమర్శించారు.

మాది ప్రజా సంక్షేమం.. వారివి కలుషిత రాజకీయాలు

ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుంటే.. వైకాపా నేతలు అనవసర, అసంబద్ధ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని నాగార్జున విమర్శించారు. జగన్ కు, ఆ పార్టీ నేతలకు వ్యవస్థలన్నా, ప్రజలన్నా చులకన భావం ఉందని తెలిపారు. పోలీసులపై కూడా అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమన్నారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, వాటిని దాటి మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

బొత్స గారూ.. ఇదేనా ఇన్నాళ్ల మీ రాజకీయ అనుభవం

సీఎం చంద్రబాబుపై సభ్యసమాజం తలదించుకునేలా అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తే.. పార్టీలకతీతంగా ఖండించాల్సిందిపోయి, జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నాయకులు సమర్థించడాన్ని ఏమనుకోవాలని నాగార్జున ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎలా ప్రోత్సహిస్తారని.. ఇదేనా బొత్స రాజకీయ అనుభవం అని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా.. జిల్లాతో పాటు, రాష్ట్రంలోనూ వైకాపా నేతల తీరు మారలేదని.. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కల్తీ నెయ్యి, మద్యం కుంభకోణాలు బయటపడుతుండటంతోనే ఆ పార్టీ నేతలు డైవర్షన్ రాజకీయాలకు తెర తీస్తున్నారని చెప్పారు. వారిని ప్రజలు క్షమించరన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల ప్రసాద్, కర్రోతు నర్సింగరావు, గంటా పోలి నాయుడు, బొద్దుల నర్సింగరావు, అవనాపు విజయ్,సువ్వారి అనురాధ (బేగం) మైలపల్లి పైడి రాజు, కొండ్రు శ్రీనివాసరావు, పాసి అప్పలనాయుడు, పీతల కోదండరాం తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Youtube Subscribe