ఏపీకి భారీ కేటాయింపులు.. నిర్మలా సీతారామన్ బడ్జెట్ భేష్: రామ్మోహన్ నాయుడు

వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. ఈ బడ్జెట్ ప్రధానమంత్రి ‘వికసిత్ భారత్’ లక్ష్యాలను వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.

విదేశీ ప్రయాణాలపై పన్ను తగ్గింపు, విమాన విడిభాగాలపై డ్యూటీ కుదింపు వల్ల పౌర విమానయాన రంగానికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన పంట అయిన కొబ్బరికి ప్రోత్సాహక పథకం, జీడి పంటకు మద్దతు ఇవ్వడం శుభపరిణామమన్నారు.

రూ.12.2 లక్షల కోట్ల కేంద్ర పెట్టుబడులతో రైల్వేలు, రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలు, డిజిటల్ మౌలిక సదుపాయాల్లో వేగవంతమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహాల ఏర్పాటు బాలికా విద్యకు బలమని పేర్కొన్నారు.

రాష్ట్రాలకు ఆర్థిక సహకారం పెంచుతూ, ఆంధ్రప్రదేశ్‌కు సింహభాగం కేటాయింపులు జరగడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

WhatsApp Join Now
Youtube Subscribe