గొల్లపూడిలో అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండించిన తెదేపా శ్రేణులు.
, విజయవాడ రూరల్, .ఎల్లో సింగం రిపోర్టార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిపై సభ్య సమాజం తలదించుకునే రీతిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంబటి రాంబాబు దిష్టిబొమ్మను మైలవరం నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపు మేరకు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇటువంటి వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. రాజకీయ నాయకుని ముసుగులో ఉండి ఇటువంటి వారు వైసీపీలో ఎందరో ఉన్నారని, పథకం ప్రకారం కుట్రపూరితంగా మాట్లాడుతూ వున్నారన్నారు.
తీవ్ర అసభ్యకర పదజాలంతో మదమెక్కి మాట్లాడిన అంబటి రాంబాబును, ఇతనికి అండగా ఉంటున్న వైసీపీని భూస్థాపితం చేయాలన్నారు. సీఎం చంద్రబాబునాయుడు గారు ఏడు పదుల వయస్సులో నవ్యాంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారన్నారు. ఆయనపై ఇలా మాట్లాడటం చూస్తుంటే చాలా బాధ కలుగుతుందన్నారు. రాజకీయ నాయకుని వేష ధారణలో ప్రజాసేవ ముసుగు తొడుక్కున్న అంబటి రాంబాబు లాంటి చీడపురుగుల నియంత్రణ కోసం చట్టాలను సవరించాలని అన్నారు.
ఇదే పంథాలో ఎంతోమంది వైకాపా నాయకులు ఉన్నారని, ఏరా.. రారా.. పోరా…అంటూ వ్యాఖ్యలు చేసే వారిపై కూడా కఠినంగా వ్యవహరించాలని కోరారు. కొంతమంది కులం కార్డు అడ్డు పెట్టుకుని ఇస్తానురాజ్యంగా, నోటి దురుసుతో మాట్లాడుతున్నారని, దీనివల్ల శాంతిభద్రతలకు కూడా విఘాతం కలుగుతుందన్నారు. పబ్లిసిటీ కోసం ఎలా పడితే అలా మాట్లాడే వారిని నియంత్రించాల్సిన అంతైనా ఉందన్నారు. స్థానిక ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
