- బొబ్బిలి పట్టణ ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పన ప్రధాన ధ్యేయం.
- ఇందిరమ్మ కాలనీ ప్రజల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం.
- బొబ్బిలి పట్టణంలో అన్ని కాలువలను అభివృద్ధి చేస్తాం.
- పర్యాటకశాఖ సహకారంతో బొబ్బిలిని మరింత అందంగా తీర్చిదిద్దుతాం.
- నియోజకవర్గ అభివృద్ధికి అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటాం.
బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-
బొబ్బిలి పురపాలక సంఘం సాధారణ నిధులు మరియు వివిధ ప్రభుత్వ గ్రాంట్లు యొక్క 2025-26 సంవత్సరపు రివైజ్డ్ బడ్జెట్ మరియు 2026-27 సంవత్సరపు బడ్జెట్ అంచనాల ఆమోదము కొరకు కౌన్సిల్ ప్రత్యేక (బడ్జెట్) మరియు అత్యవసర సమావేశం శుక్రవారం బొబ్బిలి పురపాలక కార్యాలయంలో పురపాలక చైర్మన్ రాంబార్కి శరత్ బాబు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మరియు ఎక్స్ అఫీషియో సభ్యుడు బేబినాయన పాల్గొని ఈ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను ప్రస్తావించారు.
- త్రాగునీటి సమస్య పరిష్కారం.
- రోడ్లు అభివృద్ధి.
- ఆస్తి పన్నులు మరియు వాణిజ్య పన్నులు వసూలు.
- మెయిన్ రోడ్డు విస్తరణ.
- చెరువుల పునరుద్ధరణ.
- పర్యాటకరంగం అభివృద్ధి.
- ఎస్సీ, ఎస్టీ లకు ప్రభుత్వం ఇచ్చిన కాలనీల పేర్ల మార్పు.
- ప్రధాన ఆదాయ/వ్యయ వివరములు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబినాయన మాట్లాడుతూ బొబ్బిలి పట్టణ అభివృద్ధికి ఒక ప్రత్యేక ప్రణాళిక అవసరమని, అందుకు ప్రభుత్వం తరుపున తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.తనకు వచ్చిన 44 వేల మెజారిటీలో సుమారు 19 వేలు కేవలం బొబ్బిలి పట్టణం నుంచే వచ్చిందని, తనకి పట్టణ ప్రజలకు కావల సిన మౌళిక సదుపాయాలను కల్పించడం తన బాధ్యత అని గుర్తుచేశారు. గత ప్రభు త్వం హాయంలో మంచినీటి సదుపాయం కోసం 90కోట్లు మంజూరు చేసినా నిధులు విడుదల చేయలేదని అన్నారు, తాను ఎమ్మెల్యే గా గెలిచాక పురపాలక శాఖ మంత్రి మంత్రి నారాయణ ను కలిసి ఈ సమస్య గురించి చర్చించి, ఈ సమస్య పరిష్కారానికి అదనపు నిధులు కేటాయిం చే విధంగా కృషి చేశానని ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఈ పనులను ఒకేసారి మొదలుపెడతారని, అయితే ఇక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ పనులను త్వరితగతంగా పూర్తిచేసేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే బేబినాయన తెలియజేశారు.అలాగే ఇందిరమ్మ కాల నీలో ఎంపీలాడ్స్ నుంచి డిజిటల్ లైబ్రరీ మంజూరు చేస్తామని ఎంపీ కలిశెట్టి అప్ప లనాయుడు తెలుపగా, దానికి బదులు వీధిదీపాల ఏర్పాటుకై ఆ నిధులు ఇవ్వాల ని కోరినట్లు తెలిపారు. అదేవిధంగా, ఇంది రమ్మ కాలనీలో త్రాగునీరు, రోడ్లు, కాలువ ల సమస్యలను అతితొందరలో పరిష్కరి స్తామని ఎమ్మెల్యే బేబినాయన తెలియజే శారు..బొబ్బిలి పట్టణంలో అన్ని వీధులలో కాలువలను అభివృద్ధి చేస్తామని తెలిపా రు.పర్యాటక శాఖ సహకారంతో బొబ్బిలిని మరింత అందంగా తీర్చిదిద్దుతామని అ న్నారు. బొబ్బిలి పట్టణానికి వచ్చే అన్ని అప్రోచ్ రోడ్లను ఇప్పటికే కొంతమేరకు అభి వృద్ధి చేశామని అన్నారు, పూల్ బాగ్ నుం చి దాడితల్లి గుడివరకు ఉన్న రోడ్డును కూ డా త్వరలోనే అభివృద్ధి చేస్తామని ఎమ్మె ల్యే బేబినాయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక చైర్మన్ రాంబార్కి శరత్ బాబు, పురపాలక కమిషనర్ ఎల్ రామలక్ష్మీ, వైస్ చైర్మన్ చెలికాని మురళీకృష్ణ, కౌన్సిలర్ లు, పురపాలక అధికారులు పాల్గొన్నారు…
WhatsApp
Join Now
Youtube
Subscribe
