చంద్రబాబు కోసం బండ్ల గణేష్ సంకల్ప పాదయాత్ర

శిరివెళ్ళ వద్ద యాత్రకు సంఘీభావం తెలిపిన యామ గురప్ప,,

*శిరివెళ్ళ : జనవరి,30
( ఎల్లో సింగం ప్రతినిధి )

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత , నటుడు బండ్ల గణేష్ చేపట్టిన షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు సాగుతున్న సంకల్ప పాదయాత్రకు టీడీపీ శ్రేణుల నుంచి విశేష మద్దతు లభిస్తోంది.

చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ కొనసాగుతున్న ఈ యాత్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

సంకల్ప పాదయాత్ర శిరివెళ్ళకు చేరుకున్న సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు , మాజీ జడ్పీటీసీ యామ గురప్ప సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన బండ్ల గణేష్‌ను కలసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.

చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్రాభివృద్ధికి ఎంతో కీలకమని , ఆయన తిరిగి అధికారంలోకి వచ్చినందుకు ప్రజలంతా సంతోషంగా ఉన్నారని యామ గురప్ప పేర్కొన్నారు.

ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ పాదయాత్ర విజయవంతంగా పూర్తై చంద్రబాబు నాయుడుకు మరింత ప్రజాబలం చేకూరాలని యామ గురప్ప ఆకాంక్షించారు.

బండ్ల గణేష్ చేపట్టిన ఈ సంకల్ప యాత్ర పార్టీ శ్రేణుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచి , కొత్త ఉత్సాహాన్ని అందిస్తోందని యామ గురప్ప అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమం లో మండల ఉపాధ్యక్షులు కొండబోయిన బాలచంద్రుడు , తెదేపా నాయకులు యామ శ్రీకాంత్ , కటకం శేఖర్ , ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe