తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. చివరి రోజున భారీగా అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. సాయంత్రం 5 గంటలతో అధికారిక గడువు ముగిసినా, అప్పటివరకు క్యూలో ఉన్నవారికి నామినేషన్లు వేయడానికి అవకాశం కల్పించారు. శనివారం నామినేషన్ల పరిశీలన జరగనుండగా, ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఎన్నికల ఫిర్యాదుల కోసం ఎస్ఈసీ ‘టీ ఈ పోల్’ యాప్‌తో పాటు tsec.gov.in వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
WhatsApp
Join Now
Youtube
Subscribe
