బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-
సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి చెందిన దత్తి జగదీశ్వరరావు కు రూ.140,000 లు, బలిజిపేట గ్రామానికి చెందిన కృష్ణవేణి కు రూ.45,000 లు, సీతానగరం మండలం నిడగల్లు గ్రామానికి చెందిన కర్రీ లక్ష్మనాయుడు కుటుంబ సభ్యులకు రూ. 37,114 లు,పార్వతీపురం పట్టణం మేదరవీధికి చెందిన కింతల రమే ష్ కు రూ1,77,533 లు ,పార్వతీపురం పట్టణ కొత్తవలసకి చెందిన రౌతు బాలాజీ నాయుడుకు రూ. 26,600 లు, బలిజిపేట మండలం పలగర గ్రామానికి చెందిన గుడివాడ జగ్గారావు కుటుంబ సభ్యులకు రూ. 37,100 లు చెక్కులను ఎమ్మెల్యే విజయ్ చంద్ర లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మాట్లాడుతూ పేదలకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉన్న వాళ్లకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులకు ఆర్థిక సహాయం సీఎం సహాయ నిధి కింద అందజేస్తున్నారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స చేయించుకోవటం కోసం ఎమ్మెల్యే విజయ్ చంద్ర ను సహాయం కోసం అడిగితే అడిగిన వెంటనే సీఎం సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందజేశారని అన్నారు, వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి,ఎమ్మెల్యే విజయ్ చంద్ర కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
