తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి సిట్‌ లేఖ.. కఠిన చర్యలకు సంకేతం

తిరుమల కల్తీ లడ్డూ అంశంపై సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. జరిగిన పరిణామాలు, దర్యాప్తులో వెలుగుచూసిన కీలక అంశాలను ఆ లేఖలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో లడ్డూ ప్రసాదంలో చోటుచేసుకున్న పలు లోపాలను సిట్ ప్రస్తావించినట్లు సమాచారం. లడ్డూలో కల్తీ జరిగినట్లు నిర్ధారించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను కూడా సూచించినట్లు తెలుస్తోంది.

సిట్ లేఖను పూర్తిగా పరిశీలించిన అనంతరం స్పందించాలని ప్రభుత్వం భావిస్తోంది. సిట్ క్లీన్‌చిట్ ఇచ్చినట్లు వైకాపా చేస్తున్న ప్రచారంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. తప్పుడు ప్రచారాన్ని గట్టిగా ఖండించడంతో పాటు కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. భక్తుల విశ్వాసం, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయోజనాల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

WhatsApp Join Now
Youtube Subscribe