తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైకాపా విషప్రచారం: మంత్రి సుభాష్‌ మండిపాటు

తిరుమల కల్తీ నెయ్యి అంశంపై వైకాపా నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలపై మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తీవ్రంగా స్పందించారు. సాక్షి ఛానల్‌ ఇచ్చిన క్లీన్‌చీట్‌ను సిట్‌ ఇచ్చినట్లు ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. సిట్‌ పూర్తి నివేదిక వెలువడితే నిజాలు బయటపడతాయని వ్యాఖ్యానించారు. మహాపాపాన్ని కప్పిపుచ్చుకునేందుకే వైకాపా నేతలు విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తిరుమలపై జగన్‌, ఆయన అనుచరులు ఎందుకు కక్ష పెంచుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కల్తీ జరిగినట్లు సిట్‌ నివేదికలో నిర్ధారణ అయినా సంబరాలు చేసుకోవడం ఆశ్చర్యకరమని పేర్కొంటూ, ఇకనైనా దేవుడితో ఆటలు ఆపాలని మంత్రి హితవు పలికారు.

WhatsApp Join Now
Youtube Subscribe