ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పూర్వ విద్యార్థుల విరాళాలతో రూ.100 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ సంక్షేమం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. చదువే గేమ్‌చేంజర్ అని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే సాధారణ నేపథ్యం నుంచే ఉన్నత స్థాయికి చేరవచ్చన్నారు. సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని, పీ4 కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సంపాదనలో కొంత భాగం సమాజానికి అంకితం చేయాలి: సీఎం చంద్రబాబు
30
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
