పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం చేయూత

ఎల్.ఓ.సీలను అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు .

విజయవాడ రూరల్, ఎల్లో సింగం రిపోర్టార్

పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం చేయూతనిస్తూ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వెంటనే ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన పలువురికి మెరుగైన వైద్యసేవల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి)లు మంజూరయ్యాయి. వీటిని విజయవాడ రూరల్ మండలంలో గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో లబ్దిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు అందజేశారు.
జి.కొండూరుకు చెందిన షణ్ముగం సురేష్ కు రూ.65వేలు, మైలవరం మండలం వెల్వడంకు చెందిన పొదిలి వీరాస్వామికి రూ.87లు, ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండకు చెందిన చింతల అజయ్ కుమార్ కు రూ.1 లక్ష, విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు గ్రామానికి చెందిన ఎం.మోక్షరోన్ కు రూ.2 లక్షలు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన ఎల్.ఓ.సీలను అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు అనారోగ్య బాధితులు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe