బిజెపి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా కొల్లి నాగేశ్వరరావుకు ఘన సత్కారం.

నందిగామ ఎల్లో సింగం రిపోర్టార్

ఎన్టీఆర్ జిల్లా బిజెపి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులుగా నియమితులైన కొల్లి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి కొల్లి నాగేశ్వరరావు ని శాలువాతో ఘనంగా సత్కరించి, నూతన బాధ్యతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి దిశగా కిసాన్ మోర్చా కీలక పాత్ర పోషించాలని, కూటమి ప్రభుత్వంలో రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో రైతులకు మరింత మేలు చేకూరేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ పిట్టల శ్రీదేవి, వైస్ చైర్మన్ అమ్మినేని జ్వాలా ప్రసాద్, కూటమి నేతలు, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe