భారీగా తగ్గిన బంగారం–వెండి ధరలు.. ఒక్కరోజే రూ.30వేలు క్షీణించిన వెండి

అంతర్జాతీయ పరిణామాలు, మదుపర్ల లాభాల స్వీకరణ ప్రభావంతో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో ఉదయం 11.30 గంటల సమయానికి 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,74,700గా నమోదైంది. గురువారం రాత్రి రూ.1,79,700గా ఉన్న ధరతో పోలిస్తే దాదాపు రూ.5 వేల మేర తగ్గింది.

వెండి ధర మరింత భారీగా పడిపోయింది. నిన్న రాత్రి రూ.3,99,600గా ఉన్న కిలో వెండి ధర శుక్రవారం ఉదయానికి రూ.3,70,000కు చేరింది. అంటే ఒక్కరోజే సుమారు రూ.30 వేల తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం 5,189 డాలర్లు, ఔన్సు వెండి 110 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

WhatsApp Join Now
Youtube Subscribe