తిరుమల లడ్డు కల్తీ విషయంలో సిట్ ద్వారా నిజాలు వెలుగులోకి వచ్చాయి
జగన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు కల్తీ నెయ్యి విషయంలో సమాధానం చెప్పాలి.. టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు గారు
దేవదేవుని ప్రసాదం విషయంలో జరిగిన మహా కల్తీ గుట్టు రట్టైందని, దీనికి వైసిపి అధినేత జగన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్తారని అనంతపురం జిల్లా టిడిపి అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు ప్రశ్నించారు. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో నెయ్యిపై కల్తీ జరిగిందని, సిట్ దర్యాప్తు, చార్జి షీట్ ద్వారా ఆ విషయం బట్టబయలు కావడంపై పూల నాగరాజు గారు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కనీసం చుక్క పాలు లేకుండా పూర్తి రసాయనాలతో నెయ్యి తయారు చేసి కోట్లాది లడ్డూలు ప్రజలకు సరఫరా చేశారన్నారు. గత వైసిపి హయాంలో ఐదేళ్లు హిందూ మతంపై, హిందూ దేవుళ్ళపై, పూజారులపై దాడులు చేశారన్నారు. టీటీడీలో అన్య మతస్థుల నియామకాలను చేపట్టారన్నారు. గతంలో రామతీర్థంలో రాముడు విగ్రహం ధ్వంసం, అంతర్వేది రథం దగ్ధం, సింహాచలం అపవిత్రత, దుర్గగుడిలో వెన్ను సింహాల చోరీ వంటి వాటిని జగన్ ప్రోత్సహించడమే కాకుండా, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు హిందూ మతంపై దాడులు జరిగాయి అన్నారు. తిరుపతిలో జరిగే లడ్డు కల్తీ వ్యవహారంపై మేము అనుమానం మాత్రమే వ్యక్తం చేశామని, నేడు సుప్రీంకోర్టు ఆధారం సిట్ దర్యాప్తులో నెయ్యి కల్తీ విషయంలో నిజం తేలింది అన్నారు. వైసిపి హయాంలో తిరుమలలో భ్రష్టు పట్టిన పాలనను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఒక నిర్దిష్టమైన గాడిలో పెట్టారన్నారు. దాదాపు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని స్వామి వారి ప్రసాదానికి వాడారన్నారు. కల్తీ నెయ్యి విషయంలో దాదాపు 235కోట్ల రూపాయల కుంభకోణానికి జగన్ రెడ్డి పాల్పడ్డారన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తిరుమలను రెండు కొండలు అనే వ్యాఖ్యానించారని, ఆ తర్వాత పరిస్థితులు దేశ ప్రజలంతా చూశారన్నారు. ఇప్పటికైనా కల్తీ చేసిన వాళ్లంతా స్వామివారికి ఆగ్రహానికి గురికాక తప్పదని పూల నాగరాజు గారు హెచ్చరించారు.
