నందిగామ ఎల్లో సింగం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వారి కార్యాలయంలో ఒక ప్రకటనలో మాట్లాడుతూ…
జగన్ మోహన్ రెడ్డి తాను అమాయకుడినని పదేపదే చెబుతుంటారు. అయితే ఈ ఐదేళ్ల కాలంలో ప్రజలకే కాదు… వెంకన్న స్వామికీ ఇలానే చెప్పారా?” అని ప్రశ్నించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా భక్తులను తీవ్రంగా కలచివేశాయని ఆమె తెలిపారు.ఎప్పటికైనా నిజమే గెలవాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని గుర్తుచేసిన తంగిరాల సౌమ్య , లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ చేపట్టి నివేదిక సమర్పించిందని చెప్పారు. ఆ నివేదికలో ఐదేళ్లపాటు లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యి కల్తీ చేయబడిందని స్పష్టంగా తేల్చినట్లు ఆమె వెల్లడించారు.
ఈ వ్యవహారం కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటమాడిన ఘోరమైన తప్పిదమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బాధ్యులెవరైనా సరే, వారికి కఠిన శిక్ష తప్పదని, భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గాలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆమె స్పష్టం చేశారు.
