ఫిబ్రవరి 3న విద్యార్థులకు ఉచిత కళ్లద్దాల పంపిణీ

జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం అమలులో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 94,689 మంది విద్యార్థులకు ఉచిత కళ్లద్దాల పంపిణీ చేపట్టనున్నారు.
నేత్ర సమస్యలున్న విద్యార్థులకు మెరుగైన దృష్టి అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రూ.2.25 కోట్ల నిధులు కేటాయించింది.

ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలిలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లాంఛనంగా ప్రారంభిస్తారు.

WhatsApp Join Now
Youtube Subscribe