నందలూరు, జనవరి 26:(ఎల్లో సింగం ప్రతినిధి)
రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ జంబు సూర్యనారాయణ, ఇన్చార్జి డిప్యూటీ ఎంపీడీవో మాల్యాద్రి కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.”1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం సిద్ధించినప్పటికీ, బ్రిటిష్ చట్టాల స్థానంలో మనకంటూ ఒక సొంత రాజ్యాంగం ఏర్పడి, పూర్తిస్థాయి స్వేచ్ఛా ఫలాలు లభించింది 1950 జనవరి 26 నుండేనని” గుర్తుచేశారు. ఆ చారిత్రాత్మక రోజును పురస్కరించుకుని ప్రతి ఏటా రిపబ్లిక్ డేను పండుగలా జరుపుకుంటున్నామని తెలిపారు. అనంతరం వేడుకల్లో పాల్గొన్న వారికి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్మికులు మరియు వార్డు సభ్యులు వరలక్ష్మి, ప్రసాద్, గంధం గంగాధర్, శంకర నాగేంద్ర, ఎముక దుర్గయ్య, మారే శివకుమార్ పాల్గొన్నారు. అలాగే కూటమి నాయకులు కానకుర్తి వెంకటయ్య, బెస్తా సుబ్రమణ్యం, తుమ్మాది శివకుమార్,పఠాన్ మెహర్ ఖాన్, విశ్రాంత లోకో పైలట్ కమల్ భాష, నీటి సంఘం మాజీ అధ్యక్షులు ముమ్మడి వేణుగోపాల్ రెడ్డి, బిజెపి నాయకులు మురళి, చామంతి పెంచలయ్య, శివ, నరసింహులు, వల్లి, శివ, సుధీర్, రవి, సుధాకర్ రెడ్డి మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
