అల్లు అర్జున్–సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్లో సినిమా ఆగిపోయిందంటూ ఇటీవల సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే నిర్మాత భూషణ్‌కుమార్ ఆ వార్తలకు స్పష్టత ఇచ్చారు. టీ–సిరీస్ బ్యానర్‌పై సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించనున్న రాబోయే చిత్రాల జాబితాలో అల్లు అర్జున్ మూవీ కూడా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం అదే సంస్థలో ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తెరకెక్కిస్తుండగా, అనంతరం ‘యానిమల్’ సీక్వెల్ ఉంటుంది. ఇవి పూర్తయ్యాక బన్నీతో సినిమా పట్టాలెక్కనుంది.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో #AA22 షూటింగ్లో పాల్గొంటుండగా, లోకేశ్ కనగరాజ్‌తో #AA23 తాజాగా ఖరారైంది. ఆయన 25వ చిత్రాన్ని సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ 2011 నుంచే చర్చలో ఉన్నప్పటికీ పలు కారణాలతో ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
