లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు.

భదేర్వాహ్‌–చంబా రహదారిలోని ఖన్నీ పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వాహనంలో మొత్తం 17 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందగానే ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని ఉధంపుర్‌ సైనిక ఆసుపత్రికి తరలించారు.

WhatsApp Join Now
Youtube Subscribe