సీఎం సహాయనిది చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే కోళ్ల,

ఇప్పటికే నియోజకవర్గంలో మూడు కోట్ల రూపాయలు దాటిన సీఎం సహాయనిధి,

అర్హులయియుండి సీఎం సహాయనిధి అవసరం అయినా ప్రతి ఒక్కరిని ఆదుకుంటామన్న ఎమ్మెల్యే కోళ్ల,

శృంగవరపుకోట ఎల్లో సింగం పద్ధతి జనవరి 22 :- శృంగవరపుకోట నియోజకవర్గం ఎల్కోట మండల కేంద్రం టిడిపి క్యాప్ కార్యాలయంలో శ్రుంగవరపుకోట శాసనసభరాలు కోళ్ల లలిత కుమారి, గురువారం ఉదయం సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యశాలల్లో వైద్యం చేయించుకునే వారికి ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరిని ఆదుకోవటం జరుగుతోందని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు సహకారంతో నియోజకవర్గంలో సుమారు మూడు కోట్ల పైచిలుకు సీఎం సహాయనిధి చెక్కులను అందించడం జరిగిందని అన్నారు రానున్న రోజులలో కూడా ఇది ఇలానే కొనసాగుతుందని నారా చంద్రబాబు నాయుడు అంటే నమ్మకం భరోసా అని నేడు ఏడు మంది లబ్ధిదారులకు సుమారు 3 లక్షల 90 వేల రూపాయల చెక్కలను అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకటరత్నాజీ, మండల పార్టీ అధ్యక్షులు కోళ్ల వెంకటరమణ (శ్రీను), పార్లమెంట్ అధికార ప్రతినిధి ఇందుకూరి శ్రీనివాసరాజు, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న,క్లస్టర్ ఇంచార్జ్ కొట్యాడ ఈశ్వరరావు, జామి అప్పలనాయుడు మరియు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe