కర్ణాటకలో సీన్ రిపీట్‌.. రెండు లైన్లకే పరిమితమైన గవర్నర్ ప్రసంగం, వాకౌట్

తమిళనాడు, కేరళ తరహాలోనే కర్ణాటకలోనూ గవర్నర్–ప్రభుత్వ విభేదాలు వెలుగుచూశాయి. కొత్త ఏడాది తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ చదవకుండా పక్కన పెట్టి, కేవలం రెండు లైన్లతో ప్రసంగాన్ని ముగించి సభ నుంచి నిష్క్రమించారు.

ఈ చర్యపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, సీఎం సిద్ధరామయ్య దీన్ని రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించారు. కేంద్రాన్ని విమర్శించే అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన గవర్నర్, చివరికి సభకు వచ్చి సంక్షిప్తంగా మాట్లాడి వెళ్లిపోవడంతో వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe