23 వ తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,నారా లోకేష్ పుట్టినరోజు సందర్బంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు
శృంగవరపుకోట ఎల్లో సింగం ప్రతి జనవరి 21 :- శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో జనవరి 23 వ తారీఖున టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా జరగబోవు మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలకు పిలుపునిచ్చారు బుధవారం ఎల్కోట టిడిపి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 9 గంటలకు కొత్తవలస మండలంలో విశాఖ అరకు ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న శ్రీనివాస కళ్యాణ వేదిక వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అలానే అన్ని మండల కేంద్రాల్లో నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు పిలుపునిచ్చారు రక్తదాన శిబిరాల్లో వీలైనంత రక్త సేకరణ చేసినట్లయితే మరొకరికి ప్రాణదానం చేసినట్లేనని అన్నారు
