అంతరిక్షయానం తన జీవిత దృక్పథాన్ని పూర్తిగా మార్చిందని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అన్నారు. అంతరిక్షం నుంచి భూమిని ఒకే గ్రహంగా చూసినప్పుడు మనుషుల మధ్య జరిగే విభేదాలు, గొడవలు చాలా చిన్నవిగా అనిపిస్తాయని చెప్పారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, అంతరిక్షంలో పొందిన అనుభవాలు ఐక్యత, సహకారం విలువలను మరింతగా బోధించాయని వివరించారు. నాసాలో మూడు దశాబ్దాల సేవల అనంతరం ఇటీవల పదవీ విరమణ చేసిన సునీతా, మూడుసార్లు అంతరిక్షయానం చేసి 608 రోజులు ఐఎస్ఎస్లో గడిపిన విశిష్టత సాధించారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
