ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ నం.1 స్థానాన్ని దక్కించుకున్నాడు. అతడు 845 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. గతంలో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ 795 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. న్యూజిలాండ్ సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించని రోహిత్ శర్మ 757 పాయింట్లతో నాలుగో స్థానానికి దిగజారగా, 764 పాయింట్లతో అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ మూడో స్థానంలో నిలిచాడు. శుభ్మన్ గిల్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
భారత్–న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్లో డారిల్ మిచెల్ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. టీ20 ర్యాంకింగ్స్లో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో ఉండగా, టెస్టుల్లో జో రూట్ తొలి స్థానాన్ని నిలుపుకున్నాడు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
