గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా ఆలయాల చోరీలు: కాశీబుగ్గ కేసు ఛేదన

కాశీబుగ్గలోని విజయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి సుమారు రూ.40.25 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. ఆలయంలో పనులు జరుగుతున్న సమయంలో బలహీనమైన కిటికీ ద్వారా నిందితులు లోపలికి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు, హుండీ నగదును అపహరించారు.

జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వివరాల ప్రకారం, ఈ ముఠా గూగుల్‌ మ్యాప్‌ సహాయంతో ఆలయాలను గుర్తించి, ఎక్కువ ఆభరణాలు ఉన్న దేవాలయాలనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతోంది. అక్టోబరులో జైలు నుంచి విడుదలైన ఈ ముఠా రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. గతంలోనూ పలుమార్లు పోలీసులకు చిక్కిన నిందితులపై అనేక కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు.

WhatsApp Join Now
Youtube Subscribe