ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. గాల్లో ఉండగానే నియంత్రణ కోల్పోయిన విమానం నగర శివారులోని ఓ కళాశాల వెనుక ఉన్న చెరువులో కూలిపోయింది. ప్రమాద సమయంలో భారీ శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. విమానంలో ఎంత మంది ఉన్నారనే వివరాలు ఇంకా తెలియరాలేదు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
