తిరుమల శ్రీవారి భక్తులకు సంతోషకరమైన వార్త. 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు టీటీడీ రిలీజ్ చేయనుంది. ఆర్జిత సేవా టికెట్లు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన) జనవరి 19 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులోకి వస్తాయి. టికెట్లు జనవరి 21 మధ్యాహ్నం 12 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా పొందవచ్చు.
కల్యాణోత్సవం, ఊంజల్, సహస్రదీపాలంకార, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవల టికెట్లు 22న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవా కోటా 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవుతుంది. అంగ ప్రదక్షిణ టోకెన్లు 23న ఉదయం 10 గంటలకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాయ వ్యాధిగ్రస్తుల ప్రత్యేక దర్శన టోకెన్లు 23న మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాయి.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 24న ఉదయం 10 గంటలకు, గదుల కోటా 24న మధ్యాహ్నం 3 గంటలకు, సేవా మరియు పరకామణి సేవ కోటా 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవుతాయి. భక్తులు TTD వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ సూచించింది.
