ఏపీలో మత్స్యకారుల కోసం కొత్త పథకం: కుటుంబానికి రూ.10 లక్షల సాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కొత్త పథకం ప్రవేశపెట్టింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద, మత్స్యకారులు ప్రమాదవశాత్తూ మరణించినా, వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. ఇప్పటికే ఈ బీమా రూ.2 లక్షలుగా ఉండగా, దాన్ని భారీగా పెంచింది.

పథకం అర్హతలలో మత్స్యకార సహకార సంఘ సభ్యత్వం, చేపల వేట లైసెన్స్, మత్స్యశాఖలో నమోదు, ఆధార్-రేషన్ కార్డు, బోట్లలో పనిచేసే ధృవీకరణ పత్రం ఉన్నాయి. మరణిస్తే జిల్లా మత్స్యశాఖ కార్యాలయం లేదా రైతు సేవా కేంద్రంలో డాక్యుమెంట్లతో దరఖాస్తు చేయాలి.

ప్రస్తుతానికి వేట నిషేధ సమయంలో రూ.10 వేల చొప్పున సాయం, వేట బోట్స్, వలలు, ఇంజిన్లు రాయితీపై అందించబడుతున్నాయి. ప్రభుత్వం ఈ పథకం ద్వారా మత్స్యకారులను రక్షించాలనేది లక్ష్యం.

WhatsApp Join Now
Youtube Subscribe