గుడివాడ, జనవరి 18 :
భౌతికంగా దూరమే 30ఏళ్లు గడిచిన, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అన్న ఎన్టీఆర్ తెలుగు జాతి గుండె చప్పుడని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే గుడివాడ అభివృద్ధిలో ముందు సాగుతున్నానని ఆయన పేర్కొన్నారు. గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాము మరియు కూటమి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వర్ధంతి కార్యక్రమంలో భాగంగా బైపాస్ రోడ్డులోని షాదీఖానాలో వెనిగండ్ల ఫౌండేషన్ మరియు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్, మెగా వైద్య శిబిరాలను నిర్వహించారు. స్వయంగ రక్తదానం చేస్తూ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శిబిరాన్ని ప్రారంభించి, రక్తదాతలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా రక్తదాతలకు ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రశంస పత్రాలను అందించారు. గుడివాడలో రికార్డు స్థాయిలో 250 మంది రక్తదానం చేశారు… సాయంత్రానికి ఈ సంఖ్య మరింత పెరగనుంది. అనంతరం మెగా వైద్య శిబిరంలో అందిస్తున్న వైద్య సేవలను ఎమ్మెల్యే రాము పరిశీలించి పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ సమకూర్చిన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ…, మహనీయుడు ఎన్టీఆర్ గురించి తెలుగులో ఉన్న ఉపమానాలన్నిటితో వర్ణించిన సరిపోదన్నారు.నాలాంటి ఎందరిలోనో స్ఫూర్తి నింపిన ఎన్టీఆర్ గుడివాడ వాసి కావడం గర్వకారణం అన్నారు. 30 ఏళ్లు గడిచిన తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. నేడు అన్న ఎన్టీఆర్ కు నివాళిగా రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించామన్నారు. 25 పడకలతో నిర్వహించిన రక్తదాన శిబిరానికి కూటమి శ్రేణులు, ప్రజల నుండి చక్కటి స్పందన వచ్చిందన్నారు. పది విభాగాలకు చెందిన వైద్య నిపుణులతో నిర్వహించిన శిబిరం ద్వారా వేలాదిమందికి వైద్య సేవలు అందించడం సంతోషకరమన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి,సంక్షేమం చేస్తుంటే, భువనేశ్వరి నేతృత్వంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజలకు సహాయంగా ఎన్నో కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. రక్తదాన, వైద్య విజయవంతం చేసిన కూటమి శ్రేణులు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలిపారు. కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షుడు విరంకి గురుమూర్తి మాట్లాడుతూ…, మహోన్నత వ్యక్తి, సినీరంగంలో రారాజు,రాజకీయంలో మకుటం లేని మహారాజు ఎన్టీఆర్ యుగ పురుషుడని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగానే సీఎం చంద్రబాబు నాయకత్వంలో తామంతా ముందు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. వేలాదిమందికి మంచి జరిగేలా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని గురుమూర్తి అన్నారు. ముందుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే రాము మరియు కూటమి నాయకులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. శిబిరంలో పెద్దేశ్వర హెల్త్ కేర్ సెంటర్, హెచ్ సి జి క్యాన్సర్ హాస్పిటల్, స్కిన్ స్పెషలిస్టులు, ఐ స్పెషలిస్టులు, తదితర వైద్య నిపుణులు చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్లు చాట్రగడ్డ రవికుమార్, పొట్లూరి రవి, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, రూరల్ మండల వాసే మురళి, నందివాడ మండల అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టిడిపి నాయకులు లింగం ప్రసాద్, చేకూరు జగన్మోహన్రావు, కంచర్ల సుధాకర్,కొడాలి రామరాజు, పండ్రాజు సాంబయ్య, షేక్ ఇబ్రహీం, నేరుసు కాశి, గోకవరపు సునీల్, షేక్ జానీ, సయ్యద్ జబీన్, షేక్ హర్షతునిసా, వి.సంధ్య,గొర్ల శ్రీలక్ష్మి, సిరిపురపు తులసీరాణి,వంగపండు ఆదినారాయణ,జనసేన జిల్లా కార్యదర్శి కోదమల గంగాధర్ , నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన టిడిపి నాయకులు, తెలుగు మహిళలు, తెలుగు యువత, పెద్ద సంఖ్యలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
