వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించాలి…ఎస్ఐ జ్ఞాన ప్రసాద్

బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-
బొబ్బిలి పట్టణంలో పాత బస్టాండ్ ఆంజనేయస్వామి దగ్గర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ జ్ఞాన ప్రసాద్ అన్నారు. సోమవారం ఉదయం పాత బస్టాండ్ దగ్గర ఉన్న మూడు రోడ్ల కూడలిలో వాహనాలు నడిపే వాహనదారులకు లైసెన్స్,వాహన పత్రాలు, మైనర్ డ్రైవింగ్ కలిగి ఉన్న వాహనదారులకు జరిమానాలు విధించారు.ఈ సందర్భంగా ఎస్ఐ జ్ఞాన ప్రసాద్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు.అలాగే ఇన్సూరేన్స్, మైనర్లు వాహనాలు నడపడం, అతివేగంగా నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని అవగాహన కల్పించారు.ఎస్ఐ జ్ఞాన ప్రసాద్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు…

WhatsApp Join Now
Youtube Subscribe