తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ దావోస్ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌కు బయల్దేరారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు దావోస్‌కు వెళ్తున్నారు. ఇప్పటికే దావోస్‌లో మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు.
ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సులో భాగంగా సీఎం రేవంత్ పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థల సీఈవోలతో భేటీ కానున్నారు. ముఖ్యంగా ఏఐ, సెమీకండక్టర్స్, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ వంటి కీలక రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఈ సమావేశాల ద్వారా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం చర్చలు జరపనున్నారు. దావోస్ పర్యటన ముగిసిన అనంతరం ఫిబ్రవరి 1న సీఎం రేవంత్ హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
