ఇరాన్‌ ఆందోళనలపై ట్రంప్‌–ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు

ఇరాన్‌లో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు కొత్త నాయకత్వం అవసరమని, సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ గద్దె దిగాల్సిన సమయం వచ్చిందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఖమేనీ పాలన వల్లే దేశంలో హింస పెరిగిందని, ప్రజలను అణిచివేస్తూ ఇరాన్‌ను నాశనం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

దీనికి ప్రతిగా ఖమేనీ ఘాటుగా స్పందించారు. ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనలకు ట్రంపే కారణమని ఆరోపించారు. అమెరికా విదేశీ జోక్యం వల్లే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఖమేనీ విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఇరాన్‌–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లు అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి

WhatsApp Join Now
Youtube Subscribe