తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక,మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి కార్యక్రమం ఎస్.కోటలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం బోర్డు డైరెక్టర్,టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు వైస్ ఎంపీపీ సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి,పేదరికాన్ని తుడిచిపెట్టేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై కొందరు రాజకీయం చేయడం తగదని,రాజధానిలో ఆయన విగ్రహం ఉండటం తెలుగువారందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీకి ఉన్న 2 కోట్లకు పైగా సభ్యులే మా బలం అని పార్టీ సభ్యత్వం కోసం ఏ విధంగా కృషి చేశామో,అదే స్ఫూర్తితో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు తమ వంతు విరాళాలు సేకరిస్తాం అని అన్నారు.తెలుగుజాతి గౌరవాన్ని కాపాడిన అన్నగారిని తరతరాలు స్మరించుకునేలా విగ్రహ ప్రతిష్టాపనకు తమ వంతు నిధులు సేకరించి,పార్టీ ఉన్నతికి పాటుపడతామని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి సండి సోమేశ్వరరావు పలువురు నేతలు,కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారన్నారు.
ఎస్.కోటలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలుఅమరావతిలో అన్న విగ్రహం ఏర్పాటుకు మా వంతు కృషి చేస్తాం: ఇందుకూరి సుధారాణి
18
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
