ఎన్టీఆర్ ఆశయాలే మా ఊపిరి: వర్ధంతి వేడుకల్లో మంత్రి భావోద్వేగ ప్రసంగం.

  • నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు.. పాల్గొన్న మంత్రి నారాయణ.”
  • “రక్తదాన శిబిరంలో పాల్గొని 300 మందికి పైగా రక్తదానం.. అభినందించిన మంత్రి.”
  • “పేదలతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి నారాయణ.”
  • ఎన్టీఆర్ ఆశయ సాధనే లక్ష్యం: జిల్లా పార్టీ కార్యాలయంలో వర్ధంతి వేడుకలు.
  • నందమూరి తారక రామారావుకు మంత్రి నారాయణ ఘన నివాళి!
  • సామాన్యుడిలా పేదలతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి నారాయణ!
  • ​ఎన్టీఆర్ ఒక విప్లవం.. ఆయన పథకాలు నేటికీ ఆదర్శం: మంత్రి నారాయణ.
  • ​ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్: మంత్రి నారాయణ
  • తెలుగువారి ఆత్మగౌరవానికి నీరాజనం: ఎన్టీఆర్ ఆశయ పథంలో మంత్రి నారాయణ.

​నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు…ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు..జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపును మంత్రి ప్రారంభించారు…సుమారు 300 మందికి పైగా కార్యకర్తలు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు…అనంతరం నర్తకి సెంటర్లో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా వడ్డించారు. ఆ తర్వాత పేదలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు….మంత్రి నారాయణ మాట్లాడారు.. సినీ రంగంలో పౌరాణిక, జానపద పాత్రలకు ప్రాణం పోసి మకుటం లేని మహారాజుగా వెలుగొందడమే కాకుండా, రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ ఒక విప్లవం సృష్టించారని పేర్కొన్నారని..తెలుగు వారికి కూడు, గుడ్డ, నీడ కల్పించాలనే సంకల్పంతో 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాల వంటి పథకాలను ప్రవేశపెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు… ఆస్తిలో మహిళలకు 50 శాతం హక్కు కల్పించిన ఘనత ఆయనదేనని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని తెలిపారు…ఎన్టీఆర్ స్ఫూర్తితోనే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు నాణ్యమైన ఇళ్లు, బియ్యం అందిస్తున్నారని, ఎన్టీఆర్ ఆశయాలను తామంతా కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు…ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మరియు పార్లమెంట్ అధ్యక్షులు బీద రవిచంద్ర,, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి…మాజీ శాసనసభ్యులు
కొమ్మి లక్ష్మి నాయుడు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఇంచార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్,నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ జెడ్ శివప్రసాద్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి,పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, మామిడాల మధు,ధర్మవరపు సుబ్బారావు, దోర్నాల హరి బాబు, దర్శి హరికృష్ణ, పనాబాక భూలక్ష్మి, ఐటీడీపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు రసూల్, తిరుమల నాయుడు రాష్ట్ర ముఖ్య నాయకులు, జిల్లా ముఖ్య నాయకులు రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe