మీడియా మిత్రులతో ఆత్మీయ విందు: హాజరైన ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి

  • నాగవరంలో ఘనంగా పంతగాని నరసింహ ప్రసాద్ ‘సంక్రాంతి’ సంబరాలు
  • నియోజకవర్గ జర్నలిస్టులతో సరదాగా గడిపిన ప్రముఖ నేతలు

చిట్వేలి , జనవరి 17: ఎల్లో సింగం ప్రతినిధి

సంక్రాంతి వేడుకల్లో భాగంగా చిట్వేలి మండలం నాగవరం లో ఏర్పాటు చేసిన మీడియా మిత్రుల ఆత్మీయ విందు కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ స్వగృహంలో నిర్వహించిన ఈ విందు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి చైర్మన్ శ్రీ కేకే చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కేకే చౌదరి గారు మీడియా ప్రతినిధులతో కలిసి భోజనం చేస్తూ, వారితో సరదాగా ముచ్చటించారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే మీడియా మిత్రుల సేవలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. పండుగ పూట అందరూ ఒకే వేదికపైకి రావడం ఆనందంగా ఉందన్నారు.
కార్యక్రమ నిర్వాహకులు పంతగాని నరసింహ ప్రసాద్ గారు మాట్లాడుతూ.. తన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన కేకే చౌదరి గారికి, అలాగే నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. జర్నలిస్టు సోదరులతో పండుగ పంచుకోవడం సంతోషంగా ఉందని, ఈ ఆత్మీయత ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న విలేకరులు, ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లు మరియు పలువురు టీడీపీ నాయకులు పాల్గొని విందును ఆస్వాదించారు. అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు జర్నలిస్టులలో నూతనోత్సాహాన్ని నింపాయి.

WhatsApp Join Now
Youtube Subscribe