యూత్ సర్కిల్ బ్లడ్ డొనర్స్ ను వరించిన జాతీయస్థాయి అవార్డు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లో సింగం
కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో (ఐవిఎఫ్) స్వామి వివేకానంద జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాల్లో కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు,ఎన్జీవోలు మరియు వ్యక్తులకు జాతీయ పురస్కారాలను,2025వ సంవత్సరంలో మూడుసార్లు రక్తదానం చేసిన రక్తదాతలకు ఉత్తమ రక్తదాత పురస్కారాలను, రక్తదాన శిబిరాల నిర్వహణకు సహకరిస్తున్న వారికి ఉత్తమ మోటివేటర్ పురస్కారాలను, 2025వ సంవత్సరంలో రక్తదాన శిబిరాలను నిర్వహించిన వారికి ఉత్తమ రక్తదాన శిబిరాల పురస్కారాలను సోమవారం రోజున కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి రక్తదాన సేవ కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన 79 మందికి అవార్డులను ప్రధానం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం కి చెందిన యూత్ సర్కిల్ బ్లడ్ డోనర్స్, ఐక్య తల్లిదండ్రుల సంఘం సంయుక్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి నేషనల్ అవార్డు విన్నర్ గా ఎంపిక చేసిన బాలు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సన్మాన కార్యక్రమం మాలో మరింత సామాజిక సేవా బాధ్యతను, సమాజంలో గౌరవాన్ని ఉన్నత స్థాయిలో పెంపొందించిందని, అవార్డును మన గ్రూపు తరఫున రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి అంకితం ఇస్తూ. అవార్డును సత్కరించిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్ కు మా యూత్ సర్కిల్ బ్లడ్ డోనర్స్ భద్రాద్రి కొత్తగూడెం మోతే కృష్ణ, పాషా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
