పార్వతీపురం ఎల్లో సింగం ప్రతినిధి:సీతానగరంలో పూర్వీకుల కాలం నుండి ఆనవాయితీగా వస్తున్న పండుగలు కుటుంబ , సామాజిక బంధాలను బలోపేతం చేసేందుకు దోహదపడతాయని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు పేర్కొన్నారు. బూర్జ గ్రామంలో భోగి, సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సభ్యులు ,గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. ఇంటి ముంగిళ్లలో సంక్రాంతి పండుగ సాంప్రదాయాలు ఉట్టి పడేలా మహిళలు రంగులతో ముగ్గులు వేశారు. చిన్నా, పెద్ద,యువత అంతా ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సందడి చేశారు.చిన్నారులు నృత్యాలతో అలరించారు. డాక్టర్ జగన్ మోహన్ రైతు వేషధారణలో ట్రాక్టర్ నడుపుతూ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పంటలు బాగా పండి ఇండ్లకు వచ్చే సమయమని సంక్రాంతి పండుగలో ప్రకృతి,పూర్వీకులను ఆరాధిస్తారని,నూతనత్వానికి స్వాగతం పలికుతూ ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుందన్నారు. పండుగలు మానసిక,సామాజిక,శారీరక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని,ఒత్తిడి ఆందోళన నుండి విరామం లభించి, ప్రశాంతతను,సానుకూల దృక్పథాన్ని అందిస్తాయన్నారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించి కుటుంబ, సామాజిక బంధాలను బలోపేతం చేసి మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయన్నారు.అలాగే సంప్రదాయ వంటకాలు ఆరోగ్యకరమని తెలిపారు. మన పండుగ ఆచారాలను భావి తరాలకు అందివ్వడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ హేమాక్షి, సాలూరు యూనియన్ బ్రాంచ్ మేనేజర్ డి. రాజశేఖర్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కుటుంబ, సామాజిక బంధాలను బలోపేతం చేసేందుకు పండుగలు దోహదపడతాయి: డాక్టర్ జగన్ మోహన్
17
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
