బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-
బొబ్బిలి మండలం జగన్నాధపురం గ్రామం లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఘనం గా ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించి న ఫైనల్ మ్యాచ్‌లో ఫైర్ లెవెన్ జట్టు విజేత లుగా నిలవగా, కింగ్ హిట్టర్స్ జట్టు రన్నర్స్ గా నిలిచింది.ఈ టోర్నమెంట్ కు సంబంధిం చిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం శుక్ర వారం గ్రామంలో ఉత్సాహంగా నిర్వహించ బడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ డైరెక్టర్ రౌతు రామమూర్తి నాయుడు హాజరయ్యారు.
అలాగే గ్రామ సర్పంచ్ బొద్దల పద్మ, సత్యనా రాయణ,ఎంపీటీసీ సభ్యులు రౌతు తిరుపతిరావు, బోగి రాజారావు, పంచాయతీ వార్డు మెంబర్ మామిడి మంగమ్మ విజేతలు మరియు రన్నర్స్‌కు చేతుల మీదుగా బహుమతులు అందజే శారు.ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను విజయవం తంగా నిర్వహించిన ఆర్గనైజర్ బోగి సురేష్ గారిని అతిథులు ప్రత్యేకంగా అభినందిం చారు.అలాగే మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న వావిలపల్లి సంతోష్ ను గ్రామ పెద్దలు అభినందించారు. ఈకార్య క్రమంలో జగన్నాధపురం గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడాకారుల ను ఉత్సాహంగా ప్రోత్సహించారు. గ్రామ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు..
క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగింపు…
17
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
