కనుల పండుగగా ముగ్గుల పోటీలు.. అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

​అరవపల్లిలో మహిళలు,చిన్నారుల ఉత్సాహ భాగస్వామ్యం

​విజేతలకు నగదు పురస్కారాలు, బహుమతుల ప్రదానం

​నందలూరు జనవరి 15, (ఎల్లో సింగం ప్రతినిధి)

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం అరవపల్లిలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ కార్యదర్శి సయ్యద్ అమీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన లభించింది.
​ఆకట్టుకున్న రంగవల్లులు:
గ్రామంలోని పలు ప్రాంతాల నుండి మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద ఎత్తున తరలివచ్చి రంగురంగుల ముగ్గులతో ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వేసిన ఈ రంగవల్లులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీలతో పాటు మహిళలకు, యువతీ యువకులకు, చిన్నారులకు నిర్వహించిన మ్యూజికల్ చైర్స్ పోటీలు ఉత్సాహంగా సాగాయి.
​న్యాయ నిర్ణేతలు మరియు విజేతలు:
ఈ పోటీలకు డాక్టర్ శ్రీవాణి, ఎస్.టి.యు నాయకుడు అల్లం అశోక్ కుమార్, ప్రొఫెసర్ శ్రీకళ, లక్ష్మీ నరసమ్మ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలకు బహుమతుల వివరాలు:
​ప్రథమ బహుమతి: రూ. 5,000 నగదు
​ద్వితీయ బహుమతి: రూ. 3,000 నగదు
​తృతీయ బహుమతి: రూ. 2,000 నగదు
​కన్సోలేషన్ బహుమతులు: మరో 8 మందికి రూ. 1,000 చొప్పున నగదు.
​నగదుతో పాటు సంతూర్ సంస్థ అందజేసిన ట్రావెల్ బ్యాగులు, స్టీల్ టిఫిన్ క్యారియర్లు, సోపులు, లోషన్లను అందజేశారు. పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహకంగా స్టీల్ బేసిన్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. మ్యూజికల్ చైర్స్ విజేతలకు విజ్డమ్ స్కూల్ అధినేత వల్లిమీ సుధాకర్ ప్రత్యేక బహుమతులు అందజేశారు.
​బహుమతుల ప్రదానం:
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూర్యనారాయణ, సయ్యద్ అమీర్, ఆరుముగం విశ్వనాథ్, అల్లం అశోక్ కుమార్, తుమాది శివకుమార్, కానకుర్తి వెంకటయ్య,పఠాన్ మెహర్ ఖాన్, మట్టి బాబు, హనుమంత్ పవన్ కుమార్,సుబ్బ నరసయ్య, షేక్ మౌలా,శివ నర్సింహులు తదితరుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ వేడుకలో గ్రామ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe